Welcome to Our Blog

ఆమె

ఆమె బ్లాగ్ పోస్టులు సమాజ సేవ, స్త్రీ శక్తికరణ, మరియు సాంప్రదాయ విలువల ప్రాధాన్యతపై ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలను పంచుకుంటాయి. ఆమె రచనలు పాఠకులకు అంతర్భావాన్ని కలిగించి, మంచిని చేయడానికి ప్రేరణగా ఉంటాయి.

ప్రేమించే ఒకళ్ళతో అన్ని అవసరాలు గడుపుక్కుని ప్రేమ పేరుతో సంవత్సరాలు తరబడి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసే మరొకని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు

ఆ పెళ్లి పేరుతో ఆ అమ్మాయి దగ్గర డబ్బు బంగారం వరకట్నం రూపంలో తీసుకుని ఆ కుటుంబం అంతా సేవలు చేయించుకుటారు అతనితో కాపురం చేసి పిల్లల్ని కానీ వాళ్ళను పెంచి పెద్ద చేస్తూ ఊడిగం చేయాలి అందరికీ

కానీ నేను ఒక క్యూస్షన్ అడుగుతున్నాను కొంత మందికి వింతగా అనిపించొచ్చు. మరి ప్రేమించి ఆశలు చూయించి ఉంటానని నమ్మించి ఒక ఆడదాన్ని మోసం చేసి పోతు నువ్వు . ఆమెకి ఏమి మిగిలచావు

మరొక ఆడదాని తాళి కట్టి ఆమె డబ్బు బంగారం అన్ని తీసుకుని నీ ఇంట్లో ఊడిగం చేయించుకుంటూ నీ కోరికలు తీర్చుకుని బిడ్డల్ని కనీ నీకు ఇస్తే ఆమె నీ ఉద్దరించావు

ఇలా అడిగితే మగాడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు అంటారు నిజమే పోషిస్తున్నాడు చాలా

మనసులో ఒకని పెట్టుకుంటారు ఇంకొకరితో కాపురం చేస్తారు భార్య ముందు వనీకి పోతారు .. మరొక్క ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బజార్లో వేస్తారు ఒక్కళ్ళ వల్ల జరుగుతుందా ఈ తప్పు అంటే

ఇద్దరు వల్ల జరుగుతుంది మీ తీయని మాటలు నమ్మడం ప్రేమ కోసం మీ దగ్గర ఎదురు చూడటం మోసపోవడం ఇవన్నీ ఆడవాళ్ళు చేసే తప్పే

మొన్న ఎక్కడ ఒక పోస్ట్ చదివాను ఆడది డబ్బు కోసమో మగాడిని ప్రేమిస్తుంది అని రాశారు వాళ్ళు రాసింది చెప్తున్నాను

అక్కడ ఇంకొక విషయం కూడా రాశారు

మగాడు ఆడదాని శరీరం కోసం ప్రేమని నటిస్తాడు అని

అవును నిన్ను ప్రేమించిన ఆడదానికి నిన్ను కట్టుకున్న ఆడదానికి వాళ అవసరాల కోసం డబ్బు కావాలి మరెవరిస్తారు అన్నీ నీకు సమర్పించినప్పుడు అన్నీ నీవే అనుకున్నప్పుడు నువ్వు కాకపోతే ఎవరు వాళ్ళని పోషిస్తారు ..

ఇలా అడిగితే చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఇది వాస్తవం కదా కోరికలు శృతిమించనంత వరకు తప్పులేదు అవసరాలు అప్పుల వరకు వెళ్లానంతవరకు తప్పులేదు

జీవితంలో తవ్వడం మొదలుపెడితే అన్ని తప్పులు తడికలే ఆడదాని జీవితమైనా మగవాడి జీవితం అయినా అక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడో దొరుకుతుంది

స్వచ్ఛమైన ప్రేమ ఎవరైతే ఇస్తారో వాళ్ళని బతికుండగానే సమాధి చేసేస్తారు ఈ సమాజంలోని మనుషులు ప్రేమించిన వాళ్ళు కూడా

వాళ్లయితే దెబ్బలు తిని తిని రాటు తేలిపోతారు నెగిటివ్ గా తయారై అందరు జీవితాలు సర్వనాశనం చేస్తారు

పాజిటివ్ గా ఆలోచించి తగిలిన దెబ్బలు తట్టుకుంటూ సమాజంలో ముందుకు వెళుతూ బ్రతికే వాళ్ళు చాలా తక్కువ అలాంటి వాళ్ళ జీవితాన్ని చాలెంజిగా తీసుకొని ముందుకు వెళ్తారు

ఇలాంటి వాళ్లు ఉంటే ఎంత పోతే ఎంత ఈ జీవితం నాది నాది మాత్రమే నేను ఓడిపోను ఒక్క చిన్న బలహీనత కారణంగా నేను ఓడిపోను గెలుస్తాను గెలిచి చూపిస్తాను అని సవాల్ గా నిలబడాలి అది కదా జీవితం ..

ఎవరినైనా మనం ఓడించాలంటే వాళ్ళతో పోరాడాల్సిన అవసరం లేదు జీవితంలో మనం గెలిచి చూపించాలి అది చాలు అవతలివాడు జీవిత కాలం కూడా సిగ్గుతో తల వంచుకోవడానికి ..

స్వచ్ఛంగా ఉన్నవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు మోసం లేని మనిషి నీతిగా నిజాయితీగా వందమందినీ ఎదిరించగలుగుతాడు ..

అదే దొంగలు పారిపోతుంటారు వాళ్ళకి సపోర్ట్ గా ఇంకొంతమంది దొంగలు పోగేసుకోవాలని చూస్తారు ..

తప్పు చేసిన వాడు కదా భయపడి పారిపోవాలి. వాడు కదా తల ఉంచుకుని దూరంగా సిగ్గుతో సమాజంలో వెలివేయబడాలి ..

శ్రీ..✍️